ప్రపంచంలో అత్యంత ఖరీదైన టమోటాలు..1కేజీ ధరతో 5కేజీల బంగారం కొనొచ్చు..!! ప్రస్తుతం టమాటా ధరలు కన్నీరు పెట్టిస్తున్నాయి. ధరలు భారీగా పెరుగడంతో సామాన్యప్రజానీకం కొనలేని పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల కిలో టమాటా ధర రూ. 130 నుంచి రూ. 150 కూడా పలుకుతోంది. కానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టమోటాల గురించి మీకు తెలుసా. వాటి ధర కోట్లలోనే పలుకుతుంది. అవును ఒక కిలో టమాటాను కొనుగోలు చేసే ధరతో ఐదు కిలోల బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. By Bhoomi 03 Jul 2023 in లైఫ్ స్టైల్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి టమాటా ధరలు భారీగా పెరుగుతున్నాయి. మార్కెట్లో కిలో టమోటా ధర రూ. 100లకు పైగానే పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో రూ. 150 వరకు విక్రయిస్తున్నారు. దీంతో సామాన్య ప్రజలు టమోటాలను కొనుగోలు చేసేందుకే జంకుతున్నారు. టమోటా లేని కూరలను ఊహించలేం..తప్పని పరిస్థితుల్లో కొంతమంది కొనుగోలు చేస్తున్నారు. కొన్ని చోట్ల కురిసిన భారీ వర్షాలకు టమోటా పంటలు దెబ్బతిన్నాయి. కేవలం టమోటా మాత్రమే కాదు..ఇతర కూరగాయల ధరలు కూడా భారీగానే పెరుగుతున్నాయి. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనా టమోటా విత్తనం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ టమోటాలు బంగారం కంటే ఖరీదైనవి. ఒక కిలో టమోటాలు 3కోట్లు. అదే డబ్బుతో మనం 5 కిలోల బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. అయితే ఇక్కడొక్క ట్విస్టు ఉంది. అదేంటంటే ఆ టమోటాలో సీడ్స్ ఉండవు. కాబట్టి టమోటాలను పండించాలంటే రైతులు తప్పనిసరిగా విత్తనాలను కొనుగోలు చేయాలి. కేవలం టమోటా ధర రూ. 100రూపాయలు పలుకుతుంటేనే మనం ఎలా కొనుగోలు చేయలంటూ ఆలోచిస్తున్నాం. మరి ఈ కోట్లు పలికే టమాటాల సంగతేంటి? ఈ ప్రత్యేకమైన టమోటా విత్తనాలను హజెరా జెనెటిక్స్ అనే కంపెనీ విక్రయిస్తోంది. యూరోపియన్ మార్కెట్‌లో వీటికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఇవి వేసవి సీజన్ టమోటాలు. ఈ టమాటా గింజల 1 కేజీ ప్యాకెట్ కొనాలంటే 3 కోట్ల రూపాయలు వెచ్చించాల్సిందే. దీని ధర దాదాపు 5 కిలోల బంగారం. హజెరా ఈ టమోటా రకం ఒక విత్తనం సుమారు 20 కిలోల టమోటాలను ఉత్పత్తి చేస్తుంది. అందుకే ఈ టమోటాలు ఖరీదైనవి. రుచికరమైనవి. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుందట. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి