కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్.. ఎందుకు చేశారంటే..? By Trinath 15 Jun 2023 in నేషనల్ వైరల్ New Update షేర్ చేయండి నాయకులు ఏం చెప్తే అధికారులు అది ఫాలో అవడం కామన్. కాకపోతే కొన్నిసార్లు వారు తీసుకునే నిర్ణయాలు చర్చనీయాంశమౌతాయి. వివాదాలకు దారి తీస్తాయి. తాజాగా మహారాష్ట్రలో మున్సిపల్ అధికారులు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తన చెప్పులు పోయాయని.. దానికి కుక్కలే కారణమని.. వాటిని పట్టుకోవాలని.. మాజీ మేయర్ ఇచ్చిన ఆదేశాలను పాటించిన అధికారులు.. కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఔరంగాబాద్‌లోని నక్షత్రవాడి ప్రాంతంలో మాజీ మేయర్ నందకుమార్ నివాసం ఉంటున్నారు. ముందుగా ఈయన చెప్పులు కనిపించకుండా పోయాయి. వాటికోసం ఇల్లంతా వెతికారు. పనివాళ్లకు చెప్పి వెతికించారు. కానీ, ఎక్కడా కనిపించలేదు. అవి ఎలా పోయాయో, ఎవరు ఎత్తుకెళ్లారో మిస్టరీగా ఉంది. చెప్పులు పోయిన అదే రోజు రాత్రి గుమ్మం ముందున్న షూస్ కూడా మిస్ అయ్యాయి. ఇదేంట్రా బాబూ.. వరుసగా ఇలా జరుగుతోందని అనుకుని.. ఇంటి మెయిన్ గేట్ ఓపెన్ లో ఉండడం గమనించారు. గేట్ దగ్గర ఓ కుక్క తిరుగుతూ కనిపించడం చూశారు. అంతే, కుక్కలే తన చెప్పులు ఎత్తుకెళ్లాయని భావించాడు మాజీ మేయర్. కామన్ గా కుక్కలు ఎత్తుకెళ్తే చుట్టుపక్కల అంతా వెతుకుతాం, లేదా పోతే పోయాయిలే అని లైట్ తీస్కుంటాం. కానీ, నందకుమార్ మాత్రం వాటిని పట్టుకోవాలని మున్సిపల్ అధికారులకు కంప్లైట్ ఇచ్చాడు. మాజీ మేయర్ ఆర్డర్స్ తో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఏరియాలో తిరుగుతున్న నాలుగు కుక్కలను పట్టుకుని, వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించారు. అయితే, వీధి కుక్కలపై కంప్లైంట్స్ వస్తే ఇలాంటివి చేయడం సహజంగా జరిగేదేనంటూ అధికారులు చెప్తున్నా.. ఈ విషయం మాత్రం వైరల్ అవుతోంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి