Director Nag Ashwin Efforts For Kalki 2898AD Movie : ‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్ (PAN INDIA STAR) గా మారిన ప్రభాస్ (Prabhas) మరోసారి ‘కల్కి 2898AD’ (Kalki 2898AD) తో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. ఆయన ఫ్యాన్స్ తో పాటూ సినీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ఈ సందర్భంగా థియేటర్స్ వద్ద అభిమానులు భారీగా క్యూ కట్టారు. డ్రమ్స్ వాయిస్తూ, బాణాసంచా కాలుస్తూ ఓ రేంజ్ లో హడావిడి చేస్తున్నారు. ప్రభాస్ భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి పాలాభిషేకాలు చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Nag Ashwin : ‘కల్కి’ కోసం నా చెప్పులు కూడా అరిగిపోయాయి : నాగ్ అశ్విన్
డైరెక్టర్ నాగ్ అశ్విన్ తన సోషల్ మీడియాలో 'కల్కి' సినిమా కోసం పడ్డ కష్టాన్ని ఒకే ఒక్క పోస్ట్ ద్వారా తెలిపాడు. ఈ మేరకు తన ఇన్స్టా స్టోరీలో విరిగిన చెప్పుల ఫోటోను పంచుకున్నారు. ఇది సుదీర్ఘ ప్రయాణం. ఈ సినిమా చేయడానికి చాలా ఏళ్లు కష్టపడ్డామని తెలిపాడు.
Translate this News: