Telangana CM Revanth : మేం పాలకులం కాదు…సేవకులం అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కాదు రేవంత్ అన్న అని పిలిపించుకుంటా అని చెప్పారు. ఇప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకునే పనిలో పడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన దగ్గర నుంచీ చేసిన వాగ్దానాలను తీర్చుకుంటూ వస్తూ…ప్రజల్లో ఉంటున్న రేవంత్ రెడ్డి మరోసారి టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యారు. నిన్న కేసీఆర్(KCR) ను పరామర్శించడానికి యశోద ఆసుపత్రికి వెళ్ళారు రేవంత్. అక్కడ ఆయన్ని కలిసి వచ్చేస్తుంటే…ఒక మహిళ అన్నా అని పిలిచింది. మీతో ఒకసారి మాట్లాడాలి అని అడిగింది. ఆమె ఒక్కసారి అన్నా అని పిలవగానే టక్కున ఆగిపోయారు సీఎం. వెంటనే దగ్గరకు వెళ్ళి ఏమైందని అడిగారు. యువతి వాళ్ళ నాన్నకు ఆసుపత్రిలో అయిన ఖర్చు గురించి చెబితే…వెంటనే తన టీమ్ కు చెప్పి వివరాలు కనుక్కుని సాయం అందించండి అంటూ ఆర్డర్ వేశారు రేవంత్.
పూర్తిగా చదవండి..CM Revanth Reddy : అన్నా అని పిలిచింది..నేనున్నా అంటూ ఆపన్న హస్తం ఇచ్చిన సీఎం రేవంత్
అన్నా అని పిలవండి ఎక్కుడున్నా పరుగెట్టుకుని వస్తా..ఇదీ ప్రమాణం చేసిన మరుక్షణం సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట. నిన్న ఆసుపత్రిలో కేసీఆర్ ను కలిసిన తర్వాత అన్నా అని పిలిచిన మహిళకు వెంటనే సాయం అందే ఏర్పాట్లు చేసి శభాష్ అనిపించుకున్నారు రేవంత్ రెడ్డి.
Translate this News: