CM Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరేందుకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఇవాళ మధ్యాహ్నం 1.04 గంటలకు హైదరాబాద్ (Hyderabad)లోని లాల్‌బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్, మంత్రులతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించనున్నారు. అయితే, రేవంత్ ప్రమాణ స్వీకారం అనంతరం ముఖ్యమంత్రిగా తొలి సంతకం ‘ఆరు గ్యారంటీలు’పైనే పెడతారని సమాచారం అందుతోంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆరు గ్యారంటీలను ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి ప్రాధాన్యత వాటిపైనే సీఎం రేవంత్ తొలి సంతకం పెడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పూర్తిగా చదవండి..Telangana: తెలంగాణ సీఎంగా నేడు రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం.. హాజరవనున్న ప్రముఖులు..
Translate this News: