Telangana Elections 2023: తమ ప్రతాపం అంతా పండుగ తరువాతే అని ప్రకటించిన నేతలందరూ.. దీపావళి పండుగ కోసం ఎదురు చూస్తూ వచ్చారు. మొత్తానికి దీపావళి ముగిసిపోయింది. ఇక తెలంగాణ(Telangana) ఎన్నికల్లో ఢంకా మోగించుడే అంటూ రాష్ట్రానికి జాతీయ నేతల ఆగమనం షురూ అయ్యింది. తెలంగాణ ఎన్నికలను హోరెత్తిస్తామంటూ వచ్చేస్తున్నారు జాతీయ నేతలు. తెలంగాణ ఎన్నికల వేళ రాష్ట్రానికి జాతీయ నేతలు క్యూ కట్టారు. ఈ నెల 17వ తేదీన తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలు వస్తున్నారు.
పూర్తిగా చదవండి..Telangana: తెలంగాణకు జాతీయ నేతల క్యూ.. ఒకే రోజు ఒకే చోట అమిత్ షా, రాహుల్ సభలు..!
తెలంగాణ ఎన్నికల ప్రచారం ఇక మరింత రసవత్తరంగా మారనుంది. ప్రధాన పార్టీలకు చెందిన జాతీయ నేతలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. నవంబర్ 17వ తేదీన అమిత్ షా, రాహుల్ గాంధీలు వస్తున్నారు. బీజేపీ సభల్లో షా, కాంగ్రెస్ సభల్లో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు.
Translate this News: