ఈ సారి తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ 5, టీడీపీకి 10, జనసేన 3, బీజేపీ 1 సీటులో విజయం సాధించే అవకాశం ఉందని RTV స్టడీ స్పష్టం చేస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు, నియోజకవర్గాల వారీగా లెక్కలు ఇలా ఉన్నాయి.
తుని..
ఇక్కడ కాపు సామాజికవర్గం ఓటర్లు ఎక్కువ ఉండటం వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజాకి ప్లస్ పాయింట్. వరుసగా రెండు సార్లు గెలిచి ఉండడం అడ్వాంటేజ్ అవుతుంది. యనమల కృష్ణుడు వైసీపీలో చేరడం కూడా దాడిశెట్టికి కలిసొస్తుంది. టీడీపీ అభ్యర్థి యనమల దివ్య తొలిసారి పోటీ చేస్తుండటం కూడా దాడిశెట్టికి అడ్వాంటేజ్. మొత్తంగా దాడిశెట్టి రాజా గెలిచే అవకాశం ఉందని RTV స్టడీ చెబుతోంది.
AP Game Changer: పిఠాపురంలో పవన్ గెలుపు పక్కా.. ఈస్ట్ లో ఎక్కువ సీట్లు ఆ పార్టీకే?
ఈస్ట్ గోదావరి.. రాష్ట్రంలోనే అత్యధికంగా 19 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్న జిల్లా ఇది. 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ 14, టీడీపీ 4, జనసేన ఒక సీటు గెలుచుకున్నాయి. అయితే ఈ సారి ఇక్కడ ఫలితాలు ఎలా ఉండే అవకాశం ఉందో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి.
Translate this News: