విశాఖలో మరోసారి కిడ్నాప్‌ కలకలం

విశాఖపట్నంలో మరోసారి కిడ్నాప్‌ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది.. మరో రియల్టర్ ఫ్యామిలీని కిడ్నాప్‌ చేశారు గుర్తుతెలియని వ్యక్తులు.. రియాల్టర్ శ్రీనివాస్‌, అతని భార్యలో లక్ష్మిని కిడ్నాప్‌ చేశారు దుండగులు. విశాఖలో 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కిడ్నాప్‌ వ్యవహారం సంచలనంగా మారింది.

New Update
విశాఖలో మరోసారి కిడ్నాప్‌ కలకలం

Kidnapping again in Visakhapatnam

 

అయితే, శ్రీ చరణ్ రియల్టర్ సంస్థపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. ఏడుగురు దుండగులు వచ్చి.. శ్రీనివాస్‌, లక్ష్మి దంపతులను తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.. శ్రీనివాస్ దంపతులు.. కొద్ది రోజుల క్రితమే విజయవాడ నుంచి విశాఖకు మకాం మార్చారు.. కొద్ది రోజులుగా వ్యాపారం చేసుకుంటున్నారు. ఉన్నట్టుండి దంపతులు కనిపించడకుండా పోవడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి..గాలింపు చర్యలు ముమ్మరం చేశారు పోలీసులు.

నిందితులు అరెస్ట్‌

కాగా, ఈ మధ్యే విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, కుమారుడు శరత్‌తో పాటు ఆడిటర్‌, వైసీపీ నేత గన్నమనేని వెంకటేశ్వరరావు కిడ్నాప్‌ వ్యవహారం సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఈ కేసులో నిందితులను అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఈ కిడ్నాప్‌ ఘటనకు సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి వెల్లడించారు. నిందితులు వారి నుంచి రూ.1.75 కోట్ల నగదు వసూలు చేశారని తెలిపారు. వారి నుంచి రూ.86.5 లక్షలు రికవరీ చేశామని పేర్కొన్నారు. ఇక, ఆ తర్వాత రాజకీయాలు విశాఖలో చేస్తాను.. కానీ, వ్యాపారం మాత్రం హైదరాబాద్‌లో చేస్తానంటూ విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రకటించిన విషయం విదితమే. కాగా, 2021 జూన్‌లో విజయవాడ లో శ్రీనివాస్‌ని చీటింగ్ కేసులో అరెస్ట్ చేశారు పటమట పోలీసులు.. 3 కోట్ల రూపాయలు కాజేసినట్టుగా తెలుస్తుండగా.. అందులో 60 లక్షల రూపాయల తమకు ఇవ్వాలంటూ శ్రీనివాస్‌ దంపతులను కిడ్నాప్ చేసినట్టుగా తెలుస్తోంది.

గంటల వ్యవధిలోనే  ఛేదించిన కేసు

అయితే, కిడ్నాప్ కేసును గంటల వ్యవధిలోనే ఛేదించారు విశాఖ పోలీసులు. 4వ టౌన్ పోలీసుల నలుగురు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. 2021 జూన్‌లో విజయవాడలో శ్రీనివాస్‌నీ చీటింగ్ కేసులో అరెస్ట్ చేశారు పటమట పోలీసులు. రూ.3 కోట్ల రూపాయలు శ్రీనివాస్ కాజేసినట్టు ఆరోపణలు ఉండగా.. అందులో 60 లక్షల రూపాయల ఇవ్వాలని కిడ్నాపర్లు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది.. ఈస్ట్ ఏసీపీ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు