పెళ్లి అనేది ప్రతిఒక్కరికి తమ జీవితంలో ఓ మధురమైన ఘట్టం. ముఖ్యంగా మన దేశంలో పెళ్లి వేడుకలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. పెళ్లి కార్డుల ప్రింటింగ్ మొదలుకొని.. వివాహ కార్యక్రమం పూర్తయ్యేవరకు ఆ ఇంట్లో సందడి వాతావరణం ఉంటుంది. ఎవరి స్థాయికి తగ్గట్లు వాళ్లు పెళ్లి వేడుకలు జరుపుకుంటారు. అయితే పెళ్లి కార్డుల ప్రింటింగ్ విషయంపై కొందరు ప్రత్యేక దృష్టి సారిస్తారు. విభిన్న రకాల కార్డులు తయారు చేయించుకొని తమ బంధు మిత్రులకు పంచుతుంటారు.
పూర్తిగా చదవండి..Telangana: పిల్ల, పిల్లగాడి లగ్గానికి రావాలే.. తెలంగాణ యాసలో పెళ్లి కార్డు
సాధారణంగా పెళ్లి కార్డుల్లో అచ్చమైన తెలుగుతో పాటు గ్రాంధికం, సంస్కృతం ఉంటుంది. కానీ తెలంగాణలోని కరీనంగర్ జిల్లాకు చెందిన పోకల అనే కుటుంబం విభిన్న రీతిలో తమ ఇంటి పెళ్లి వేడుక కార్డును ప్రింట్ చేయించింది. మొత్తం తెలంగాణ యాసలోనే ఈ పెళ్లి పత్రికను తయారు చేయించింది.
Translate this News: