Donald Trump Claims Joe Biden Exit From 2024 Race : అమెరికా (America) అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ నేత జోబైడెన్ (Joe Biden) అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై రిపబ్లికన్ పార్టీ (Republican Party) అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందించారు. జో బైడెన్‌ను బలవంతంగా తొలగించారంటూ ఆరోపణలు చేశారు. ఇది డెమోక్రాట్లు చేసిన పెద్ద కుట్ర అంటూ.. మిన్నెసోటాలో శనివారం జరిగిన ఓ ప్రచార కార్యక్రమంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ జో బైడెన్‌కు 1.4 కోట్ల ఓటర్ల మద్దతు ఉంది. పెద్ద కుట్రకు పాల్పడి అతడిని రేసు నుంచి తొలగించారు. అధ్యక్ష రేసులో నుంచి వెళ్లకుంటే.. అవమానకర రీతిలో తప్పించాల్సి వస్తుందని సొంతపార్టీ నేతలే బెదిరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ద్వారా బలవంతంగా తొలగించాల్సి వస్తుందని హెచ్చరించారని’ ట్రంప్ అన్నారు.
పూర్తిగా చదవండి..USA : బైడెన్‌ను బలవంతంగా తొలగించారు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
జో బైడెన్‌ను అధ్యక్ష రేసు నుంచి బలవంతంగా తొలగించారంటూ రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ ఆరోపించారు. ఇది డెమోక్రాట్లు చేసిన పెద్ద కుట్రగా అభివర్ణించారు. అధ్యక్ష రేసులో నుంచి తప్పుకోకుంటే.. అవమానకర రీతిలో తొలగించాల్సి వస్తుందని సొంతపార్టీ నేతలే బెదిరించారని ఆరోపించారు.
Translate this News: