గుజరాత్లోని వడోదరలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం 12. 30 గంటలు శ్రీ నారాయణ్ స్కూల్లోని మొదటి అంతస్తులో ఉన్న ఓ తరగతి గది గోడ ఒక్కసారిగా కూలింది. దీంతో పలువురు విద్యార్థులు కిందపడిపోవడంతో వారికి తీవ్రంగా గాయాలయ్యాయి. లంచ్ బ్రేక్ సమయంలో విద్యార్థులు క్లాస్లో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. విద్యార్థులు తమ సైకిల్స్ పార్కింగ్ చేసే స్థలంలో ఈ గోడ కూలింది. ఒక విద్యార్థికి తలపై తీవ్రంగా గాయమైనట్లు స్కూల్ ప్రిన్సిపల్ రూపాల్ షా తెలిపారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
పూర్తిగా చదవండి..Watch Video: క్లాస్ రూమ్లో కూలిన గోడ.. ఫస్ట్ ఫ్లోర్ నుండి కింద పడ్డ విద్యార్థులు..
గుజరాత్లోని వడోదరలో శ్రీ నారాయణ్ స్కూల్లోని మొదటి అంతస్తులో ఉన్న ఓ తరగతి గది గోడ ఒక్కసారిగా కూలింది. దీంతో పలువురు విద్యార్థులు కిందపడిపోవడంతో వారికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఒక విద్యార్థికి తలపై తీవ్రంగా గాయమైనట్లు స్కూల్ ప్రిన్సిపల్ తెలిపారు.
Translate this News: