T20 World Cup 2024 : ప్రపంచకప్ ప్రతీ క్రికెటర్ (Cricketer) కల. మొత్తం కెరీర్లో ఒక్కసారి అయినా కప్‌ను ముద్దాడాలని అనుకుంటారు. ఎంత గొప్ప ఆటగాడు అయినా..రికార్డ్‌లు ఎన్ని సాధించినా..ఎన్ని రన్స్ చేసినా…రాని తృప్తి ఒక్కసారి వరల్డ్‌కప్ ఎత్తుతుంటే వస్తుంది. అలాంటి కలను ది గ్రేట్ వాల్ రాహుల్ ద్రావిడ్ (Rahul Dravid) మిస్ అయ్యాడు. తన మొత్తం కెరీర్లో ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్న ద్రావిడ్ ప్రపంచకప్‌ను మాత్రం అందుకోలేకపోయాడు. తన ఆటకు గుడ్‌బై చెప్పిన తర్వాత రాహుల్ తిరిగి టీమ్ ఇండియా (Team India) కు కోచ్ అయ్యాడు.టీమిండియా హెడ్ కోచ్‌గా 2021లో రాహుల్ ద్రావిడ్ అపాయింట్ అయ్యారు. ఆ ఏడాది యుఏఈ వేదికగా సాగిన టీ20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే ద్రావిడ్.. ఛార్జ్ తీసుకున్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌తో కోచ్‌గా బోణీ కొట్టారు. ఆ తరువాత వెనుదిరిగి చూసుకునే అవసరం లేకుండా జట్టును రాటుదేల్చారు.
పూర్తిగా చదవండి..Rahul Dravid : విశ్వవిజేతలకు గురువుగా ప్రపంచకప్‌ను ముద్దాడిన మిస్టర్ వాల్
ఆటగాడిగా నేరవేర్చుకోలేకపోయిన కలను కోచ్‌గా తీర్చుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌ను సగర్వంగా పైకెత్తి విజయగర్జన చేశాడు. తన మొత్తం కెరీర్లో ఇలాంటి రోజు కోసం ఎదురు చూసిన మిస్టర్ వాల్ అపూర్వ విజయంతో తన కోచ్ కెరీర్‌కు గుడ్ బై చెప్పాడు.
Translate this News: