Sanjiv Goenka Angry Over KL Rahul : నిన్న హైదరాబాద్ ఉప్పల్ లో జరిగిన ఎస్ఆర్హెచ్, జెయింట్స్ (SRH VS LSG) మ్యాచ్‌లో అన్నీ సంచలనాలే. అంతా వింతే. చాలా కీకలమైన మ్యాచ్‌లో సన్ రైజర్స్ అద్భుతంగా ఆడింది. లక్నో ఇచ్చిన టార్గెట్‌ను కేవలం 9.4 ఓవర్లలోనే 167 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. దీంతో ఆ టీమ్ ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. అంతకుముందు లక్నో జెయింట్స్ 20 ఓవర్లు ఆడి 4 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఇది ఐపీఎల్లో చాలా తక్కువ స్కోరు. అందులోనూ ఎమంచి ఫామ్‌లో ఉన్న ఎస్ఆర్హెచ్ లాంటి టీమ్‌లకు ఇంత చిన్న టార్గెట్లు ఇవ్వకూడదు. పెద్ద పెద్ద లక్ష్యాలనే అలవోకగా ఆడి పడేస్తున్నారు సన్‌రైజర్స్ టీమ్ వాళ్ళు. అలాంటి వాళ్ళకు ఇంత చిన్న స్కోరు ఇస్తే…చిన్న పిల్లలను కొట్టిపడేసినట్టు..పడేయరూ. నిన్న లక్నో జెయింట్స్ టీమ్‌కు ఈ అనుభవమే ఎదురయింది.
పూర్తిగా చదవండి..SRH VS LSG: నీ జిడ్డాటకో దండం..ఆయన ప్రవర్తనకు మరో దండం..
నిన్న హైదరాబాద్‌లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ అక్నో జెయింట్స్‌ను చిత్తుగా ఓడించింది. ఆరెంజ్ ఆర్మీ అద్భుతంగా ఆడడం ఓ ఎత్తైతే..లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ జిడ్డాట మరో ఎత్తు. వీళ్ళద్దరి కన్నా లక్నో ఓనర్ గోయెంకా..జట్టు కెప్టెన్‌ను బహిరంగంగా తిట్టడం అన్నింటికన్నా హైలెట్.
Translate this News: