RCB VS SRH : ఆర్సీబీ పని అయిపోయింది. నాకౌట్ దశ నుంచే వెనుదిరుగుతుంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో గెలిచి తాము ఇంకా ఉన్నామంటూ నిరూపించుకుంది ఆర్సీబీ. నిన్న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం(Hyderabad Uppal Stadium) లో హైదరాబాద్ సన్ రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో గెలిచింది బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు. బౌలర్లు క్రమశిక్షణతో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సన్ రైజర్స్ ఓడిపోక తప్పలేదు. రికార్డు స్కోర్లు, వరుస విజయాలతో దూసుకెళ్తున్న సన్‌రైజర్స్ జోరుకు సొంత గ్రౌండ్ మీద బ్రేకులు పడ్డాయి. బ్యాటర్లు విఫలమవడంతో ఆ జట్టు మూడో ఓటమిని ఖాతాలో వేసుకుంది.
పూర్తిగా చదవండి..IPL 2024 : మొత్తానికి గెలిచిన ఆర్సీబీ..ఆరు ఓటముల తర్వాత విజయం
అందరూ హైదరాబాద్ సన్‌రైజర్స్ టీమే గెలుస్తుంది అనుకున్నారు. మళ్ళీ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆ జట్టు రికార్డ్‌లు సృష్టిస్తుందని కూడా భావించారు. కానీ అనూహ్యంగా ఆర్సీబీ నిన్నటి మ్యాచ్‌లో విజయం సాధించింది. ఆరు ఓటముల తర్వాత గెలిచింది.
Translate this News: