Alexei Navalny Death: రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రత్యర్థి, విపక్ష నేత అలెక్సీ నావల్నీ మరణం ఇంకా వీడని మిస్టరీగానే మిగిలిపోయింది. ఇప్పటికే అమెరికా, కెనడా, యూకే సహా మరికొన్ని దేశాలు ఆయన మరణానికి పుతిన్ (Vladimir Putin) బాధ్యుడంటూ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఆసక్తికర కథనం వెలుగులోకి వచ్చింది. నావల్నీ తల (Head), ఛాతిపై (Chest) కమిలిన గాయాలున్నాయని ఓ స్థానిక మీడియా సంస్థ తెలిపింది. ఆయన మృతదేహాన్ని మార్చురీకి తరలించినప్పుడు ఈ గాయాలు కనిపించాయని ఓ వైద్య నిపుణుడ్ని ఉటంకిస్తూ పేర్కొంది.
పూర్తిగా చదవండి..Navalny: నావల్నీ మృతిపై కీలక అప్డేట్.. ఆయన తల, ఛాతిపై కమిలిన గాయాలు..!
నావల్నీ మరణానికి సంబంధించి మరో కీలక కథనం బయటపడింది. ఆయన తల, ఛాతిపై కమిలిన గాయాలున్నాయని ఓ స్థానిక మీడియా చెప్పింది. మృతదేహాన్ని మార్చురీకి తరలించినప్పుడు ఈ గాయాలు కనిపించినట్లు ఓ వైద్య నిపుణుడ్ని ఉటంకిస్తూ పేర్కొంది.
Translate this News: