KA Paul At CM Jagan Residence: ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ (KA Paul) ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను (CM Jagan) కలిసేందుకు తాడేపల్లిలో సీఎం క్యాంపు నివాసానికి (Tadepally CM Camp Office) వెళ్లారు. అయితే సీఎంను కలిసేందుకు అనుమతి లేదంటూ KA పాల్ ను క్యాంపు కార్యాలయం లోకి వెళ్లేందుకు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కేఏ పాల్, పోలీసుల నడుమ వాగ్వాదం నడిచింది. సీఎం జగన్ ను కలిసే వరకు తాను వెనక్కి వెళ్లానని కేఏ పాల్ సీఎం క్యాంపు కార్యాలయం వెళ్లే రోడ్డు మెయిన్ గేట్ వద్ద చాలా సమయం వేచి చూశారు. ఎంత సమయం ఎదురుచూసిన సీఎం జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంతో కేఏ పాల్ తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వెనక్కి వెళ్లిపోయారు.
పూర్తిగా చదవండి..KA Paul: జగన్ ఇక మాజీ సీఎం.. KA పాల్ శాపనార్థాలు
తనకు అపాయింట్ మెంట్ ఇవ్వకపోతే సీఎం వైఎస్ జగన్ కూడా మాజీ సీఎం అవుతారన్నారు కేఏ పాల్. ఈ రోజు సీఎం జగన్ ను కలిసేందుకు తాడేపల్లిలో సీఎం కార్యాలయానికి వచ్చిన కేఏ పాల్ అపాయింట్ మెంట్ లేదని పోలీసులు అనుమతించకపోవడంతో ఈ వ్యాఖ్యలు చేశారు.
Translate this News: