VV Vinayak To Contest As MP: మరి కొన్ని నెలల్లో పార్లమెంట్ ఎన్నికలతో (Parliament Elections) పాటు ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections) జరగనున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ (YSRCP) వ్యూహాలు రచిస్తోంది. బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలని ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ తో ఎంపీగా పోటీ చేయించాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. వీవీ వినాయక్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (NTR) తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీకి అత్యంత సన్నిహితుడిగా పేరుంది.
పూర్తిగా చదవండి..YCP: వైసీపీలోకి ఎన్టీఆర్ ఫ్రెండ్.. అక్కడి నుంచే ఎంపీగా స్టార్ డైరెక్టర్ పోటీ?
త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైసీపీ నుంచి హీరో జూనియర్ ఎన్టీఆర్ మిత్రుడైన స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. రేపు లేదా సోమవారం సీఎం జగన్ తో వినాయక్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అదే రోజు ఆయన వైసీపీలో చేరుతారన్న ప్రచారం సాగుతోంది.
Translate this News: