Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో.. ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఒకరిపై ఒకరు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ర్యాలీలు, కార్నర్ మీటింగ్స్, రోడ్ షోలతో దుమ్మురేపుతున్న నేతలు.. ప్రత్యర్థులపై మాటల తూటాలు వదులుతున్నారు. మీరేం చేశారు? అంటే మీరేం చేశారు? అంటూ ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా నేతల ప్రచారాలకు సంబంధించిన వీడియోలతో సోషల్ మీడియా హోరెత్తిపోతుంది. సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేస్తే చాలు.. పార్టీల ప్రచారానికి సంబంధించిన వీడియోలే దర్శనమిస్తున్నాయి.
పూర్తిగా చదవండి..Telangana Elections: కేసీఆర్కు జై కొట్టిన పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి.. వీడియో వైరల్..
పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి యశస్విని రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా జై కేసీఆర్ అంటూ నినదించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీఆర్ఎస్ శ్రేణులు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఎంతటి ప్రత్యర్థులైనా కేసీఆర్కు జై కొట్టాల్సిందేనంటున్నారు.
Translate this News: