IT Raids in Vivek House: మంచిర్యాల జిల్లాలో చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇంట్లో ఐటి అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. వివేక్ ఇంటితో పాటు ఆయనకు సంబంధించిన కంపెనీలు, ముఖ్య అనుచరులు, బంధువుల ఇళ్లలో కూడా ఐటి దాడులు జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది. హైదరాబాద్, చెన్నూరులో ఏక కాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వివేక్ ఇంటితో పాటు.. ఆయన సోదరుడు, కూతురు ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. వివేక్ కంపెనీకి చెందిన వ్యక్తులు కొందరు ఇటీవలే రూ. 50 లక్షలతో పట్టుబడ్డారు. ఆ తరువాత విశాఖ ఇండస్ట్రీస్‌కు చెందిన రూ. 8 కోట్లను ఫ్రీజ్ చేశారు. విశాఖ ఇండస్ట్రీస్ అకౌంట్ నుంచి విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ ఖాతాలోకి ఆ మనీని ట్రాన్స్ఫర్ చేశారు. ఈ నెల 13వ తేదీన నగదు బదిలీ అయినట్లు గుర్తించారు అధికారులు.
పూర్తిగా చదవండి..Telangana Elections: కాంగ్రెస్ నేత వివేక్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు..
ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకులపై ఫోకస్ పెంచింది ఐటీ. తాజాగా చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి జి. వివేక్ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఆయన ఇల్లు, బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు.
Translate this News: