Minister Malla Reddy Election Affidavit: మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి మల్లారెడ్డి ఎన్నికల అఫిడవిట్ తప్పుల తడకగా మారింది. పరిస్థితి చూస్తుంటే ఆయన నామినేషన్ రద్దయ్యేలా కనిపిస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో(Telangana Elections) మల్లారెడ్డి అఫిడవిట్‌పై తీవ్ర వివాదం నెలకొంది. ఆయన దాఖలు చేసిన అఫిడవిట్ తప్పుల తడకగా ఉంది. ఇదే అంశంపై మేడ్చల్ రిటర్నింగ్ అధికారికి అంజిరెడ్డి అనే ఓటర్ ఫిర్యాదు చేశారు. మల్లారెడ్డి తన ఎడ్యూకేషన్ క్వాలిఫికేషన్‌ను తప్పుగా చూపించినట్లు కంప్లైంట్ ఇచ్చారు సదరు వ్యక్తి. 3 ఎన్నికల్లో 3 రకాలుగా ఎడ్యూకేషన్ డీటైల్స్ పేర్కొన్నారు మల్లారెడ్డి. 1973లో ఇంటర్ చేసినట్లు చూపారు మల్లారెడ్డి. అయితే, గత మూడు ఎన్నికల అఫిడవిట్లలో మూడు కాలేజీల్లో ఇంటర్మీడియట్ చదివినట్లుగా పేర్కొన్నారు. ఇప్పుడిదే వివాదాస్పదంగా మారింది.
పూర్తిగా చదవండి..Telangana Elections: అడ్డంగా బుక్కైన మంత్రి మల్లారెడ్డి.. నామినేషన్ రిజెక్టేనా?
మంత్రి మల్లారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఆయన సమర్పించిన అఫిడవిట్ తప్పుల తడకగా ఉందంటూ ఎన్నికల అధికారులకు కంప్లైంట్ ఇచ్చారు పలువురు. ఒకే సంవత్సరం 3 కాలేజీల్లో ఇంటర్ చదివినట్లు పేర్కొన్నారని ఆరోపించారు.
Translate this News: