Aditya L1 Captures High-Energy Solar Flare: చంద్రయాన్ – 3 (Chandrayaan-3) విజయవంతం కావడంతో భారత్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇది సక్సెస్ కావడంతో జోష్ మీదున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) .. సూర్యునిపై పరిశోధనలు చేసేందుకు ఆదిత్య ఎల్1 (Aditya L1) ప్రయోగాన్ని చేపట్టింది. అయితే ఈ ఆదిత్య ఎల్1 వ్యోమనౌక మొదటిసారిగా సౌర జ్వాలలకు సంబంధించి హై ఎనర్జీ ఎక్స్‌రే రే చిత్రాన్ని ఫొటో తీసింది. ఆ వ్యోమనౌకలో ఉన్న ‘హై ఎనర్జీ ఎల్1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్’ (హెచ్ఈఎల్1ఓఎస్) ఈ ఘనత సాధించింది. దీనిపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మంగళవారం ఓ ప్రకటన చేసింది. సౌర వాతావరణం అకస్మాత్తుగా ప్రకాశవంతంగా అయిపోతే దాన్ని సౌర జ్వాల అని అంటారు. హెచ్ఈఎల్1ఓఎస్‌ను (HEL1OS) గత నెల 27న ఇస్రో ఆన్ చేసింది.
పూర్తిగా చదవండి..ISRO: మరో ఘనత సాధించిన ఆదిత్య ఎల్1.. సౌరజ్వాలను క్లిక్‌మనిపించిన వ్యోమనౌక
ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్1 మరో ఘనతను సాధించింది. ఆ వ్యోమనౌకలో ఉన్న 'హై ఎనర్జీ ఎల్1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్' మొదటిసారి సౌర జ్వాలలకు సంబంధించి హై ఎనర్జీ ఎక్స్‌రే చిత్రాన్ని ఫొటో తీసింది. ఈ పరికరంతో పూర్తిస్థాయి పరిశీలనలు చేసేందుకు సిద్ధమవుతోంది ఇస్రో.
Translate this News: