Health Tips : నిద్రలేచామా.. రెడీ అయ్యామా.. పరుగు పరుగునా ఆఫీస్‌కు వెళ్లామా.. మళ్లీ తిరిగి ఇంటికి చేరుకొని తిన్నామా.. పడుకున్నామా.. ఇదే రొటీన్‌గా మారిపోయిన లైఫ్(Routine Life) లు చాలా మందివి. ముఖ్యంగా సిటీ(Cities) ల్లో ఉంటున్న వారి జీవితం ఇలానే గడిచిపోతుంది. ఐటి సెక్టర్(IT Sector) లో పని చేసేవాళ్ల లైఫ్ ఇలానే ఉంటుంది. కనీసం రోజుకు 10నిమిషాలు కూడా నడవని పరిస్థితి కొందరిది. అయితే ఇలానే కంటిన్యూ చేస్తే లేనిపోని వ్యాధులు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. చాలామందికి 30ఏళ్ల లోపే అనేక ఆరోగ్య సమస్యలు(Health Diseases) వస్తున్నాయి. వ్యాయామం లేకనే ఇలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయన్నది చాలా మంది వైద్య నిపుణులు చెబుతున్న మాట. రోజుకు 25నిమిషాల వ్యాయామంతో అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని సూచిస్తున్నారు. రోజుకి 25 నిమిషాలు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకోండి.
పూర్తిగా చదవండి..Health : ఈ చిన్న చిట్కాతో అనేక వ్యాధులకు చెక్.. మీ ఆయుష్షు కూడా పెరుగుతుంది!
రోజుకు 25 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల నిద్ర నాణ్యత పెరుగుతుంది. ఇది టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు రక్తపోటు కంట్రోల్లో ఉండేలా చేస్తుంది.వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది.
Translate this News: