యంగ్ ఏజ్ లోనే చనిపోయిన సెలబ్రిటీలు, హీరోలు ఈ మధ్య కాలంలో ఎక్కువ అయిపోతున్నారు. వీరందరి చావుకు కారణం అతి వ్యాయామం. సినిమాల కోసం తగ్గాలనో, లైమ్ లైట్ లో ఉండాలనో వీరు చేస్తున్న వర్కౌట్లు వారి ప్రాణాలనే తీస్తున్నాయి. మామూలు జనం కూడా దీనికి మినహాయింపేమీ కాదు. వాళ్లు సెలబ్రిటీలు కాబట్టి అందరికీ తెలుస్తోంది. సాధారణ మనుషులు చనిపోతుంటే తెలియడం లేదు అంతే తేడా. లావు ఉన్నా లేకపోయినా వ్యాయామం చేయడం ఎప్పుడూ మంచిదే. అలాగే డైట్ ఫాలో అవ్వడం కూడా చాలా మంచింది. కానీ ఏం చేసినా ఒక పరిమితిగా చేయాలి. ఒక పద్ధతి ప్రకారం చేయాలి. సరైన గైడెన్స్ తో చేయాలి. ఎలా పడితే అలా చేస్తే ప్రాణాలు పోతాయి. లైఫ్ టైమ్, తిండి, వ్యాయామం వీటి మీద చాలానే అధ్యయనాలు జరిగాయి.
పూర్తిగా చదవండి..Work outs: 40ల్లో ఉన్నారా… హెవీ వర్కౌట్స్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే.
ఒబేసిటీ ఇప్పుడు అన్నింటికన్నా అతి పెద్ద సమస్యగా తయారయింది. దీనికి కారణాలు అనేకం. కొంతమందికి కొన్ని శారీరక సమస్యల వల్ల వస్తుంటే మరికొంత మందికి మితిమీరిన ఆహారం, బద్ధకం వల్ల వస్తోంది. లావు తగ్గుతున్నారా లేదా అన్న విషయం పక్కన పెడితే దాని మీద ఎవేర్ సెస్ బాగా పెరిగిపోయింది. ఇంకా చెప్పాలంటే అదొక ఫ్యాషన్ కింద తయారయిపోయింది. దానికి తగ్గట్టే బోలెడు రకాల ఫిట్ నెస్ మంత్రాలు కూడా వచ్చేస్తున్నాయి. కల్ట్ ఫిట్ నెస్, యోగా, వర్కౌట్స్, జిమ్ ఇంకోటి, ఇంకోటి... లావు తగ్గడానికి వీటిని ఉపయోగిస్తే పర్వాలేదు కానీ దాన్ని ఫ్యాషన్ గా, పేషన్ గా కూడా తీసుకుంటేనే ప్రమాదం. ఇప్పడు అదే జరుగుతోంది. మితిమీరిన వర్కౌట్లు చేయడం, తమ బాడీకి ఏది సరిపోతుందో తెలుసుకోకుండా ట్రైనింగ్ లు ఫాలో అయిపోవడం...ప్రాణాల మీదకు తెస్తోంది. సెలబ్రిటీలు కూడా ఇందుకు ఏ మాత్రం తీసిపోవడం లేదు.
Translate this News: