Balagam Movie Actor Narsingam Passed Away: తెలుగు రాష్ట్రాలలో సంచలన సృష్టించిన ‘బలగం’ సినిమా(Balagam Movie) నటుడు.. ఆ సినిమా కీలక పోషించిన నర్సింగం చనిపోయారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న కీసరి నర్సింగం (Narsingam).. తుదిశ్వాస విడిచారు. నర్సింగం మృతి విషయం తెలుసుకున్న కమెడియన్, డైరెక్టర్ వేణు(Venu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బలగం సినిమా సందర్భంగా నర్సింగంతో ఏర్పడిన అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు వేణు. ఆయన మృతికి సంతాపం తెలిపిన వేణు.. ‘నర్సింగం బాపుకి శ్రద్ధాంజలి. మీ చివరి రోజుల్లో బలగం సినిమా ద్వారా మీలోని నటుడిని చూసుకుని, మీలోని కళాకారుడు సంతృప్తి చెందడం నేను అదృష్టంగా భావిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు వేణు.
పూర్తిగా చదవండి..Balagam Movie: ‘బలగం’ సినిమా నటుడు మృతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన డైరెక్టర్ వేణు..
రాజన్నసిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం నాగారం గ్రామానికి చెందిన నర్సింగం.. బలగం సినిమాలో సర్పంచ్‌గా కీలక పాత్ర పోషించారు. సర్పంచ్‌గా ఆయన పోషించిన పాత్ర యావత్ ప్రేక్షక లోకాన్ని ఎంతో అకట్టుకుంది. అచ్చం మన పల్లెటూర్లలో ఎలాగైతే పెద్దలు వ్యవహరిస్తారో.. అలాగే తన నటించి అందరినీ మెప్పించారు.
Translate this News: