BDL Recruitment 2023: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమా? అయితే మీకో శుభవార్త. పలు ఉద్యోగాల భర్తీకి భారత్ డైనమిక్స్ లిమిటెడ్(BDL) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 45 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియను నేటి నుంచి ప్రారంభించింది. సెప్టెంబర్ 20వ తేదీ వరకు దరఖాస్తులు పెట్టుకునేందుకు సమయం ఇచ్చింది. bdl-india.in అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఫైనాన్స్ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీని పూర్తి చేయనుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. పార్ట్-1లో సంబంధిత సబ్జెక్ట్/టాపిక్‌పై 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. జనరల్ ఆప్టిట్యూడ్‌పై 50 ప్రశ్నలు అడగనున్నారు. రాతపరీక్ష ఈ ఏడాది డిసెంబర్ లేదా 2024 జనవరిలో జరగనుంది.
పూర్తిగా చదవండి..BDL Recruitment: డిగ్రీ పాసయ్యారా? అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థ BDLలో ఉద్యోగం పొందండి
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమా? అయితే మీకో శుభవార్త అందించింది భారత్ డైనమిక్స్ లిమిటెడ్(BDL).పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది.
Translate this News: