ఆంధ్ర సెటిలర్స్ పై తనకు గౌరవం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. తన వ్యాఖ్యలు కేవలం గాంధీని ఉద్ధేశించనవేనని స్పష్టం చేశారు. ఇప్పుడు జరుగుతున్నది గాంధీ చెప్పినట్లు కౌశిక్ రెడ్డికి, ఆయనకు మధ్య జరుగుతున్న వ్యక్తిగత యుద్ధమేనని అన్నారు. ఇక్కడ నివసిస్తున్న ఆంధ్ర సెటిలర్స్ కు కాలులో ముల్లు గుచ్చుకున్న పంటితో తీస్తా అని గతంలో కేసీఆర్ చెప్పారన్నారు. అందుకు అనుగుణంగానే బీఆర్ఎస్ పదేళ్ల పాలన సాగిందన్నారు.
సిగ్గు, శరం, లజ్జ, మానం ఉంటే.. మరోసారి రెచ్చిపోయిన కౌశిక్ రెడ్డి!
దానం నాగేందర్ కు సిగ్గు, శరం, లజ్జ, మానం ఉంటే ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. ఆంధ్ర సెటిలర్స్ పై తనకు గౌరవం ఉందన్నారు. గాంధీపై తాను చేసిన వ్యాఖ్యలు కేవలం ఆయనను ఉద్దేశించినవేనని స్పష్టం చేశారు.
Translate this News: