Hydra: అక్రమ కట్టడాల భరతం పడుతున్న హైడ్రాకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు రేవంత్ సర్కార్ సిద్దమైనట్లు తెలుస్తోంది. భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియలోనూ హైడ్రాకు భాగస్వామ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇకపై హైడ్రా NOC ఇస్తేనే నిర్మాణాలకు అనుమతులు వచ్చేలా కార్యాచరణను మొదలు పెట్టింది. చెరువులు, నాలాల సమీపంలోని భవనాలకు హైడ్రా అధికారుల అనుమతులు తప్పనిసరి కానున్నట్లు ప్రభుత్వ యంత్రంగాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Hydra: రేవంత్ సర్కార్ మరో మార్క్… హైడ్రాకు కీలక బాధ్యతలు!
TG: హైడ్రాకు మరో కీలక బాధ్యతలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైనట్లు తెలుస్తోంది. చెరువులు, నాలాల సమీపంలోని భవనాల నిర్మాణాలకు హైడ్రా అనుమతి తప్పనిసరి చేయాలని ప్రభుత్వం ఆలోచలనలో ఉన్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
Translate this News: