ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసంపై దాడి విషయాన్ని తెలుసుకున్న హరీశ్ రావు.. సిద్దిపేట నుంచి కౌశిక్ రెడ్డి నివాసానికి బయలుదేరారు. దీంతో ఆయనను పోలీసులు అనుమతిస్తారా? లేదా అన్న విషయంపై టెన్షన్ నెలకొంది. అంతకు ముందు హరీశ్ రావు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఇదేం ప్రజాస్వామ్యం? ఇదేం ప్రజాపాలన? ఇదేం ఇందిరమ్మ రాజ్యం? అని ప్రశ్నలు గుప్పించారు. మా పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి చేర్చుకోవడంతో పాటు, వారినే ఉసిగొల్పి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు.
పూర్తిగా చదవండి..Koushik Reddy Vs Gandhi: కౌశిక్ రెడ్డి ఇంటికి హరీశ్ రావు.. భారీ కాన్వాయ్ తో సిద్దిపేట నుంచి..
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య వివాదం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీశ్ రావు హుటాహుటిన సిద్దిపేట నుంచి బయల్దేరారు. కౌశిక్ రెడ్డి నివాసానికి హరీశ్ రావు వెళ్లనున్నారు.
Translate this News: