Hydra: హైదరాబాద్ లో అక్రమకట్టడలను నేలమట్టం చేస్తున్న హైడ్రా ఇప్పుడు హైటెక్ సిటీ పై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే మాదాపూర్, జూబ్లీహిల్స్, మణికొండ వంటి ప్రాంతాల్లోని చెరువుల ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో నిర్మించిన అక్రమకట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. కాగా ఇప్పుడు హైటెక్ సిటీలోని చెరువులు, నాలాలను కబ్జా చేసి కట్టిన కట్టడాలను కూల్చేందుకు అధికారులు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే చెరువులు ఆక్రమించి కొంతమంది పలు బాడాబాబులు కట్టిన బిల్డింగులు పడగొట్టిన హైడ్రా ఇప్పుడు పైలెట్ ప్రాజెక్టు కింద ఇక్కడి రెండు నాలాలను సర్వే చేసేందుకు సిద్దమైనట్లు సమాచారం.
పూర్తిగా చదవండి..Hydra: హైడ్రా నెక్స్ట్ టార్గెట్ హైటెక్ సిటీ.. కూల్చేది వాటినే!
TG: ఆక్రమణల కూల్చేవేతలతో దూకుడు మీద ఉన్న హైడ్రా ఇప్పుడు హైటెక్‌సిటీలోని నాలాలపై ఫోకస్ పెట్టింది. ఇందుకోసం మరో వారం రోజుల్లో ప్రత్యేక బృందంతో ఏరియల్ సర్వే చేసేందుకు సిద్దమైనట్లు సమాచారం. దీంతో హైటెక్ సిటీలో భారీగా కూల్చివేతలు ఉంటాయన్న ప్రచారం సాగుతోంది.
Translate this News: