Coffee Cake Recipe: కేక్ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. బర్త్‌డేలు, పెళ్లి రోజులు, ఏదైనా శుభకార్యం వంటి సందర్భాలు ఉంటే ఎక్కువగా కేక్‌ను కట్ చేస్తారు. అయితే.. ఎక్కువగా మార్కెట్లో ఉండే కేక్‌లు తెస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో కల్తీ వస్తువులను మనం చూస్తేనే ఉంటున్నారు. అలాంటి బయట ఫుడ్స్‌ని చిన్న పిల్లలుకు పెడితే వారికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే పిల్లలకు ఎక్కువగా బయట ఫుడ్స్ పెట్టవద్దని వైద్యులు చెబుతూ ఉంటారు. అయితే కేక్‌ల్లో కాఫీ కేక్ బెస్ట్‌గా అంటుంటారు. అందుకే దీనిని తినటానికి ఎక్కువగా ఇష్టపడుతారు. దీనిని బయట నుంచి తీసుకోవడం కంటే.. ఇంట్లోనే దీనిని టేస్టీగా, స్వీట్‌గా చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లోనే ఏదైనా చేయాలనుకుంటే.. తక్కువ సమయంలో ఈ కాఫీ కేక్‌ను తయారు చేయవచ్చు. దీన్ని తయారు చేసే విధానం చాలా సులభంగా ఉంటుంది. ఇంట్లో కాఫీ కేక్‌ను ఎలా తయారు చేయాలో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
కాఫీ కేక్ చేయడానికి కావాల్సిన పదార్థాలు:
- పెరుగు
- కాఫీ పొడి
- నూనె
- పాలు
- వెనీలా ఎసెన్స్
- పిండి
- చక్కెర
- బేకింగ్ పౌడర్
- బేకింగ్ సోడా
- ఉప్పు
తయారీ విధానం:
కాఫీ కేక్ చేయడానికి.. ఒక గిన్నెలో పెరుగు, కాఫీ పొడి, నూనె, పాలు, వెనీలా ఎసెన్స్ వేసి అన్నింటినీ బాగా కలపాలి. మరొక గిన్నెలో, పిండి, చక్కెర, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు వేసి ఇప్పుడు రెండు మిశ్రమాలను కలపాలి. ఇప్పుడు ఈ పిండిని గ్రీజు చేసిన బేకింగ్ టిన్‌లో పోయాలి. ఇప్పుడు ఓవెన్లో 30-35 నిమిషాలు, కేక్ బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు కాల్చాలి. ఇప్పుడు కేక్ చల్లారిన తర్వాత సర్వ్ చేయాలి. మీకు కావాలంటే కేక్‌కి ఎండుద్రాక్ష, బాదం, చాక్లెట్ చిప్స్ కూడా కల్పవచ్చు. దీంతో కేక్ రుచి పెరుగుతుంది. ఈ కాఫీ కేక్‌ని ఇంట్లోనే రుచికరంగా చేసి తినవచ్చు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.