Actress Hema: బెంగళూరు డ్రగ్స్ కేసులో తన పేరును పోలీసులు ఛార్జిషీట్లో పెట్టడంపై నటి హేమ స్పందించారు. తాను ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదని అన్నారు. బెంగళూరు పోలీసుల ఛార్జిషీట్లో తన పేరు వచ్చినట్టు తెలిసిందని.. తాను డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం అని చెప్పారు. ఛార్జిషీట్ తనకు వచ్చాక దీనిపై స్పందిస్తానని అన్నారు. తనకు ఉన్న సమాచారం మేరకు డ్రగ్స్ రిపోర్ట్‌లో నెగిటివ్ అని ఛార్జిషీట్లో వేసినట్లు తెలుస్తుందని అన్నారు. MDMA డ్రగ్స్ తాను తీసుకోలేదని క్లారిటీ ఇచ్చారు.
పూర్తిగా చదవండి..Actress Hema: నేను ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదు: నటి హేమ
రేవ్ పార్టీ కేసులో బెంగళూరు పోలీసులు తన పేరును ఛార్జిషీట్లో పెట్టడంపై నటి హేమ స్పందించారు. తాను డ్రగ్స్ తీసుకున్నానని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తాను ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదని చెప్పారు. తాను డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్నారు.
Translate this News: