Puja Khedkar: మాజీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ విషయంలో కేంద్రం మొత్తానికి నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్ళూ ప్రొబేషన్‌లో ఉన్న పూజాను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నుంచి తొలగించింది. ఐఏఎస్ (ప్రొబేషన్) రూల్స్, 1954 ప్రకారం ఆమెపై చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. పుణెలో ట్రైనీ సహాయ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఆమెపై అధికార దుర్వినియోగంతో పాటు యూపీఎస్సీలో తప్పుడు అఫిడవిట్ పత్రాలు సమర్పించారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
పూర్తిగా చదవండి..Delhi: ఐఏఎస్ నుంచి పూజా ఖేద్కర్ తొలగింపు
మాజీ ఐఏఎస్ ప్రొబేషనరీ అధికారిణి పూజా ఖేద్కర్ విషయంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆమెను ఐఏఎస్ నుంచి తొలగిస్తూ షాక్ ఇచ్చింది. అంతకు ముందు ఆమె సభ్యత్వాన్ని యూపీఎస్సీ కాన్సిల్ చేసింది.
Translate this News: