Congress- NC : జమ్మూ–కశ్మీర్ ఓ జరిగే ఎన్నికల మొదటి విడత నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఈరోజుతో ముగుస్తోంది. ఇక్కడ పలు పార్టీలు పోటీ చేయనున్నాయి. వాటిల్లో ఇండియా కూటమి పార్టీలు కూడా ఉన్నాయి. వీటిల్లో జమ్మూ–కశ్మీర్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. దీనిపై ఈరోజు రెండు పార్టీలు ఒక ఒప్పందానికి వచ్చాయి. జమ్మూకశ్మీర్లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఒప్పందం ప్రకారం.. 32 చోట్ల కాంగ్రెస్, 51 స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ పోటీ చేయనున్నాయి. ఈ విషయాన్ని జమ్మూకశ్మీర్ యూనిట్ కాంగ్రెస్ చీఫ్ తారిఖ్ హమీద్ కర్రా తెలిపారు. మిగతా ఐదు స్థానాల్లో కాగ్రెస్, ఎన్సీల మధ్య స్నేహపూర్వక పోటీ ఉంటుందని తెలిపారు. ఇక రెండు స్థానాల్లో సీపీఎం, జేకేఎన్పీసీ అభ్యర్ధులు పోటీ చేయనున్నారు.
పూర్తిగా చదవండి..Jammu-Kashmir: జమ్మూకశ్మీర్ ఎన్నికలు..కాంగ్రెస్–ఎన్సీ ఒప్పందం
మరి కొన్ని రోజుల్లో జమ్మూకశ్మీర్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల మధ్య సీట్ల ఒప్పందం కుదిరింది. 32 చోట్ల కాంగ్రెస్, 51 స్థానాల్లో ఎన్సీ పోటీ చేయనున్నాయి. ఇక్కడ సెప్టెంబర్ 18 నుంచి మూడు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
Translate this News: