Kolkata Rape Accused: కోల్‌కతా వైద్యురాలి కేసులో సీబీఐ విచారణ వేగవంతం చేసింది. ఇవాళ ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించనుంది. ఆర్జీ కర్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ సందీష్ ఘోష్‌తోపాటు మరో ఆరుగురికి పాలిగ్రాఫ్ టెస్ట్ పూర్తి చేసింది. ఇప్పటికే కోల్‌కతాకు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ చేరుకున్నారు. జైలులోనే సంజయ్ రాయ్‌కు టెస్ట్ నిర్వహించనున్నారు. మరోవైపు నిందితుడు వాడిన బైక్‌ను సీజ్ చేశారు పోలీసులు.
పూర్తిగా చదవండి..Kolkata Rape Accused: కోల్‌కతా హత్యాచారం కేసు.. నిందితుడు సంజయ్ రాయ్‌కు నేడు పాలిగ్రాఫ్ టెస్ట్!
కోల్‌కతా పీజీ డాక్టర్‌పై హత్యాచారం కేసులో ఈరోజు నిందితుడు సంజయ్ రాయ్‌కు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించనున్నారు. కాగా తనను కావాలనే ఈ కేసులో ఇరికించారని జడ్జి ముందు నిందితుడు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
Translate this News: