Trainee Doctor Rape Case: పశ్చిమ బెంగాల్ (West Bengal) రాజధాని కోల్‌కతా (Kolkata) లో ట్రైనీ డాక్టర్ (Trainee Doctor) ను హత్యాచారం చేసిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రిపూట విధుల్లో ఉన్న ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగింది. నిందితుడిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కానీ అతడి తల్లి మాలతీ రాయ్ మాత్రం తన కొడుకు నిర్ధోషి అని.. పోలీసుల ఒత్తిడితోనే చేయని తప్పును ఒప్పకున్నాడని ఆరోపించింది. అయితే ఇతను ఎప్పటి నుంచో చెడు ప్రవర్తన కలిగి ఉన్నాడని..నాలుగు పెళ్ళిళ్ళను చేసుకున్నాడని పోలీసుల ఎంక్వైరీలో తేలింది. అతడి దుష్ప్రవర్తన వల్లే ముగ్గురు భార్యలు విడిచిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు తరుచూ తాగిన మత్తులో అర్ధరాత్రి ఇంటికి వస్తుండేవాడని స్థానికులు తెలిపారు.
పూర్తిగా చదవండి..Kolkata : కోల్కత్తా అత్యాచారం సంఘటనలో వెలుగులోకి నమ్మలేని నిజాలు
కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా నిరసనలు రేగుతున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ వినిపిస్తోంది. మరోవైపు ఈ కేసులో సంచలన విషయాలు బయటపెట్టారు పోలీసులు. ట్రైనీ డాక్టర్‌ను మొదట హత్య చేసి తరువాత నిందితుడు రేప్ చేశాడని పోలీసులు చెబుతున్నారు.
Translate this News: