సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవాళ్లు ప్రతిరోజూ గంటల తరబడి చదవాల్సి ఉంటుంది. ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగాలు సాధించాలంటే సొంతంగా ప్రిపేర్ అవ్వడం కంటే కోచింగ్ తీసుకోవడం మంచిదని చాలామంది చెబుతుంటారు. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లలో చూస్తే లక్షల్లో ఫీజులు ఉంటాయి. కోచింగ్ తీసుకోవాలనుకునే పేద, మధ్యతరగతి కుటుంబాల వాళ్లకి ఇది చాలా కష్టం. ఈ నేపథ్యంలోనే తెలంగాణ షెడ్యూల్ క్యాస్ట్ స్టడీ సర్కిల్ ఉచితంగా హాస్టల్ వసతితో కూడిన కోచింగ్ ఇస్తోంది.
పూర్తిగా చదవండి..UPSC: సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నారా ? ఫ్రీ కోచింగ్, ఫ్రీ హాస్టల్.. ఎక్కడంటే
హైదరాబాద్‌లోని తెలంగాణ షెడ్యూల్ క్యాస్ట్ స్టడీ సర్కిల్ ఉచిత హాస్టల్ వసతితో కూడిన కోచింగ్ ఇస్తోంది. ప్రతి ఏడాది 100 అడ్మిషన్లను తీసుకుంటున్నారు. ఇందుకోసం ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. tsstudycircle.co.inలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు జులై 31 చివరి తేది.
Translate this News: