Union Budget 2024: కేంద్ర బడ్జెట్లో ఏపీకి ఇచ్చింది రుణమా..? గ్రాంటా…? రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడిదే హాట్ డిబెట్.. రాజధాని అమరావతికి (Capital Amaravati) కేంద్రం ఇచ్చింది లోన్ అని వైసీపీ వాదిస్తుండగా.. కాదు కాదు గ్రాంటేనని తెలుగుతమ్ముళ్లు చెబుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాజధాని నిర్మాణానికి 15,000 కోట్లు, రానున్న సంవత్సరాల్లో అదనపు నిధులు ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా (Nirmala Sitharaman) చెప్పడం వరకు బాగానే ఉంది కానీ అసలు నిధులు ఇస్తానన్నది ఏ రూపంలోనన్నది క్లారిటీ లేకపోవడం పలు విమర్శలకు, గందరగోళానికి కారణమైంది. ఇంతకీ ఏపీకి కేంద్రం నుంచి దక్కేది రుణమా? గ్రాంటా?
Explainer: కేంద్ర బడ్జెట్లో ఏపీకి ఇచ్చింది రుణమా..? గ్రాంటా…?
అమరావతి నిర్మాణానికి రూ.15,000 కోట్లు ఇస్తామని నిన్న కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన నాటి నుంచి ఏపీలో కొత్త చర్చ మొదలైంది. ఈ నిధులు ఇస్తానన్నది ఏ రూపంలోనన్నది క్లారిటీ లేకపోవడం పలు విమర్శలకు, గందరగోళానికి కారణమైంది. ఇందుకు సంబంధించిన విశ్లేషణను ఈ ఆర్టికల్ లో చదవండి.
Translate this News: