Actress Anjali: టాలీవుడ్ టాలెంటెడ్ నటి అంజలి.. ఇటీవల విడుదలైన “బహిష్కరణ” వెబ్ సిరీస్ తో (Bahishkarana Web Series) మరోసారి ప్రేక్షకులను మెప్పించింది. ప్రముఖ ఓటీటీ ‘జీ 5’ (Zee5) లో రిలీజైన ఈ సిరీస్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. అంజలి ఇందులో వేశ్య పాత్ర పోషించింది. ఆ పాత్రలో అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకుంటున్నప్పటికీ.. తాజాగా ఈ సిరీస్ లో కొన్ని ఇంటిమేట్ సీన్స్ లో నటించడం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
Anjali: ఆ బోల్డ్ సీన్స్ కోసం నరకం చూశా.. వాష్‌రూమ్‌కు కూడా వెళ్లకుండా: అంజలి
'బహిష్కరణ' వెబ్ సిరీస్ లో ఇంటిమేట్ సీన్స్ చేయడంపై అంజలి స్పందించింది. ఈ మేరకు తాజా ఇంటర్వ్యూలో.." ఆ సీన్స్ చేసేటప్పుడు అందర్నీ బయటికి బయటకు పంపించి, క్లోజ్ డోర్స్ వెనుక షూట్ చేశాం. అవి చేసేటప్పుడు నాకు చాలా అసౌకర్యంగా అనిపించింది" అని చెప్పింది.
Translate this News: