ఈ రోజు రైతు రుణమాఫీ నిధుల విడుదల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేయకుండా వెన్నుచూపి పారిపోయింది తమరని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కొడంగల్ లో సన్యాసం చేస్తానని ప్రకటించి, వెన్నుచూపి పారిపోయింది కూడా ఆయనేనన్నారు. నిరంతరంగా పారిపోయిన చరిత్ర రేవంత్ రెడ్డిది అని అన్నారు. అనునిత్యం ప్రజల పక్షాన నిలిచిన చరిత్ర తనదన్నారు. పదవుల కోసం మీరు పెదవులు మూసుకొని కూర్చొంటే.. మంత్రి, ఎమ్మెల్యే పదవులను సైతం తృణ ప్రాయంగా భావించి రాజీనామా చేసిన చరిత్ర తనదన్నారు.
పూర్తిగా చదవండి..Harish Rao: మళ్లీ చెబుతున్నా.. రుణమాఫీ చేస్తే రాజీనామాకు సిద్ధం: రేవంత్ కు హరీష్ సవాల్
ప్రభుత్వం ఆగష్టు 15 వరకు రాష్ట్రంలోని రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు సంపూర్ణంగా అమలు చేస్తే తాను రాజీనామాకు సిద్ధమని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు మరోసారి స్పష్టం చేశారు. చేయని పక్షంలో నువ్వు సిద్ధమా.. అని సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి సవాల్ విసిరారు.
Translate this News: