ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జగనున్న సంగతి తెలిసిందే. డెమోక్రాటిక్ పార్టీ నేత, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ మధ్య గట్టి పోటీ ఉండనుంది. ఇప్పటికే ఇరు పార్టీల నేతలు ఎన్నికల ప్రచారాలతో బిజీబిజీగా గడుపుతున్నాయి. అయితే సోమవారం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పార్టీ సమావేశంలో.. ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహియో రిపబ్లికన్ సెనేటర్ జేడీ వాన్స్‌ను ప్రకటించారు. ఆ తర్వాత.. ఒకప్పుడు ట్రంప్ విమర్శకుడిగా వ్యవహరించిన జేడీ వాన్స్.. ఆ పార్టీ సమావేశంలో భారత సంతతికి చెందిన తన భార్య ఉషా చిలుకూరి వాన్స్ చాలా సపోర్ట్ చేసిందంటూ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో భారత సంతతికి ఉషా చిలుకూరి పేరు మారు మోగిపోతోంది. ఇంతకి ఆమె ఎవరూ, ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Usha Chilukuri Vance: అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి భార్య ఉషా చిలుకూరి.. ఏపీలో మూలాలు!
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఒహియో రిపబ్లికన్ సెనేట్ జేడీ వాన్స్ పేరును ప్రకటించారు. దీంతో జేడీ వాన్స్ సతీమణి, భారత సంతతికి చెందిన ఉషా చిలుకూరీ పేరు మారుమోగిపోతోంది. ఆంధ్రప్రదేశ్ మూలాలున్న ఆమె గురించి తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.
Translate this News: