Revisiting How Donald Trump Helped ISCON Devotees : అమెరికా (America) మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) పై శనివారం కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సీల్వేనియాలో నిర్వహించి ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై ప్రసంగిస్తుండగా.. ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ట్రంప్ చెవికి గాయమైంది. అనంతరం ట్రంప్‌ను సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాల్పులు జరిపిన నిందితుడిని భద్రతా సిబ్బంది హతమార్చారు. ర్యాలీకి హాజరైన ట్రంప్ మద్దతుదారుడు ఒకరు ఈ దాడిలో మృతి చెందాడు. ప్రస్తుతం ట్రంప్ క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఇది 48 ఏళ్ల క్రితం జరిగిన ఓ సంఘటనను గుర్తుచేస్తోంది. 1976 జులైలో.. న్యూయార్క్ నగరంలో మొదటిసారిగా పూరీ జగన్నాథుడి యాత్రను నిర్వహించేందుకు ఇంటర్నేషనల్ సోసైటీ ఫర్ కృష్ణ కాన్సియస్నెస్ (ISKCON) కు ట్రంప్ సాయం చేశారు. ఇప్పుడు ఇదే సమయంలో ట్రంప్ తనపై జరిగిన దాడుల నుంచి త్రుటిలో తప్పించుకోవడంతో ఆ జగన్నాథుడే కాపాడాడని ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ రాధారామ్ దాస్ ఎక్స్ వేదికగా తెలియజేశారు.
పూర్తిగా చదవండి..Trump : పూరీ జగన్నాథుడే ట్రంప్‌ను రక్షించాడు : ఇస్కాన్
1976 జులైలో న్యూయార్క్‌లో పూరీ జగన్నాథుడి యాత్ర నిర్వహణ కోసం ISKCON సంస్థకు ట్రంప్ సాయం చేశారు. ఇప్పుడు జగన్నాథుడి వేడుకలు జరుగుతున్న వేళ.. ట్రంప్‌పై కాల్పులు జరగడంతో ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఆ పూరీ జగన్నాథుడే ట్రంప్‌ను రక్షించాడని ఇస్కాన్ భక్తులు చెబుతున్నారు.
Translate this News: