Trump Social Media Accounts: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన ఫేక్‌బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై ఆంక్షలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెటా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రంప్‌నకు సంబంధించిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ‘ పొలిటికల్ లీడర్ల భావ వ్యక్తీకరణ స్వే్చ్ఛకు పర్మిషన్ ఇవ్వడం మా బాధ్యత. అందుకే ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ సోషల్ మీడియా అకౌంట్లపై ఆంక్షలు ఎత్తివేస్తున్నాం. ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల ఆలోచనలను, మాటలను అమెరికా ప్రజలు వినాలని భావిస్తున్నాం. అందరు యూజర్ల లాగే అభ్యర్థులు కూడా రూల్స్‌కు కట్టుబడి సోషల్ మీడియా ఖాతాలను వినియోగించుకోవాలి. హింసను, విద్వేషాన్ని ప్రేరేపించేలా ప్రసంగాలు చేయకూడదని’ మెటా సంస్థ తెలిపింది.
పూర్తిగా చదవండి..Donald Trump: ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలపై ఆంక్షలు ఎత్తివేత..
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన ఫేక్‌బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు మెటా సంస్థ ప్రకటించింది. రాజకీయ నేతల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు పర్మిషన్ ఇవ్వడం మా బాధ్యత అని.. అందుకే ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.
Translate this News: