Elon Musk: ఈ ఏడాది నవంబర్‌లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు (US Presidential Election)జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రస్తుత అధ్యక్షుడు, డెమొక్రాటిక్ నేత జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఎన్నికల ప్రచారాలు మొదలుపెట్టారు. అయితే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. ట్రంప్ ప్రచారానికి పెద్ద మొత్తంలో విరాళం అందించినట్లు తెలుస్తోంది. ఎంత ఇచ్చారు అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. గతంలో ఎలాన్ మస్క్.. బైడెన్‌కి గానీ ట్రంప్‌నకు గానీ తన నుంచి ఎలాంటి ఆర్థిక సహాకారం ఉండదని చెప్పారు. కానీ ఇప్పుడు ట్రంప్ తరఫున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న పొలిటికల్ యాక్షన్ కమిటీకి విరాళాలు ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.
పూర్తిగా చదవండి..Elon Musk -Trump: ట్రంప్ ప్రచారానికి ఎలాన్ మస్క్ విరాళం.. !
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. ట్రంప్ ప్రచారానికి పెద్ద మొత్తంలో విరాళం అందించినట్లు తెలుస్తోంది. జులై 15న పొలిటికల్ యాక్షన్ కమిటీ విరాళాలకు సంబంధించిన విషయాలు వెల్లడించనుంది. అప్పుడే ఎలాన్ మస్క్ నుంచి ట్రంప్ ప్రచారం కోసం ఎంత ముట్టిందనే దానిపై క్లారిటీ రానుంది.
Translate this News: