CM Chandrababu Says To Stop Planting Legs : పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ (NTR Bhavan) లో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు సీఎం చంద్రబాబు (CM Chandrababu). కాళ్లకు దండం పెట్టే సంస్కృతి వీడాలని అన్నారు. ఎవరైనా తన కాళ్లకు దండం పెడితే.. వారి కాళ్లకు తాను దండం పెడతా అని చెప్పారు. ఇవాళ్టి నుంచి తన కాళ్లకు దండం పెట్టే విధానానికి ఫుల్స్టాప్ పెడుతున్నానని అన్నారు. తల్లిదండ్రులు, భగవంతుడు కాళ్లకు దండం పెట్టాలి తప్ప నాయకులకు కాదు అని హితవు పలికారు. నాయకుల కాళ్లకు దండం పెట్టి ఎవరూ తమ గౌరవాన్ని తగ్గించుకోవద్దని చెప్పారు. నాయకుల కాళ్లకు ప్రజలు, పార్టీ శ్రేణులు దండం పెట్టొద్దనే సంస్కృతి నా నుంచే ప్రారంభిస్తున్నా అని అన్నారు. పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజల నుంచి వినతులు స్వీకరించారు సీఎం చంద్రబాబు.Plan
CM Chandrababu : నా కాళ్ళు మొక్కకండి ప్లీజ్.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
AP: రాష్ట్రంలో కాళ్ళు మొక్కే సంస్కృతిని అంతం చేయాలని అన్నారు సీఎం చంద్రబాబు. తల్లిదండ్రులు, భగవంతుడు కాళ్లకు దండం పెట్టాలి తప్ప నాయకులకు కాదు అని అన్నారు. నాయకుల కాళ్లకు ప్రజలు, పార్టీ శ్రేణులు దండం పెట్టొద్దనే సంస్కృతి తన నుంచే ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
Translate this News: