Spice jet Employee: స్పైస్ జెట్ ఉద్యోగిని సెక్యూరిటీ అధికారిని చెప్పుతో కొట్టిన గొడవతో జైపూర్ విమానాశ్రయం హోరెత్తింది. సెక్యూరిటీ స్క్రీనింగ్‌పై దగ్గర ఉన్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ తో ఉద్యోగిని గొడవ జరిగింది. ఉద్యోగిని వాహనంపై గేటు ద్వారా ఎయిర్‌పోర్టులోకి ప్రవేశిస్తుండగా.. ఆ గేటును ఉపయోగించడానికి అనుమతి లేదని ఆమెను నిలిపివేశారు. ఈ సందర్భంగా ఘర్షణ చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ ఉద్యోగిని వెర్షన్ మరోలా ఉంది. సెక్యూరిటీ సిబ్బంది తనతో అనుచితంగా ప్రవర్తించారని…లైగింక వేధింపులు చేశారని చెబుతున్నారు. ఆమోదయోగ్యం కాని పదాలను ఉపయోగించారని చెబుతున్నారు. అంతేకాదు డ్యూటీ పూర్తయ్యాక వచ్చి తనను కలవమని అడిగారని అంటున్నారు.
పూర్తిగా చదవండి..Jaipur: సెక్యూరిటీ ఆఫీసర్‌ను చెప్పుతో కొట్టిన స్పైస్ జెట్ ఉద్యోగిని
జైపూర్ ఎయిర్‌పోర్ట్‌లో అనూహ్య సంఘటన జరిగింది. ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ స్క్రీనింగ్ దగ్గర జరిగిన గొడవలో సెక్యూరిటీ ఫోర్స్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ను స్పైస్ జెట్ ఉద్యోగిని చెప్పుతో కొట్టింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.
Translate this News: