Rahul Gandhi: ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీ.. హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడారంటూ ఆయనపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ఓ హిందూ ఆలయం (Maharashtra Temple) బయట రాహుల్ గాంధీ ఫొటో ఉన్న డోర్‌మ్యాట్‌ను (Door Mat) వినియోగిస్తున్నారు. హిందువులు హింసావాదులని పిలవడానికి మీకెంత ధైర్యం ? అని ఆ డోర్‌మ్యాట్‌పై హిందీలో రాశారు. ఆ ఆలయంలోకి వెళ్లే భక్తులు తలుపు బయట ఉన్న ఆ డోర్‌మ్యాట్‌ను తొక్కుకుంటూ వెళ్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
పూర్తిగా చదవండి..Watch Video: ఆలయం బయట రాహుల్ ఫొటోతో డోర్‌మ్యాట్.. వీడియో వైరల్
ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో విపక్ష నేత రాహుల్ గాంధీ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ఓ హిందూ ఆలయం బయట రాహుల్ ఫొటోతో కూడిన డోర్‌మ్యాట్‌ను వాడటం దుమారం రేపుతోంది.
Translate this News: