Kamal Haasan Reveals Why He Rejected Robo Movie : సెన్షేషనల్ డైరెక్టర్ శంకర్ – సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) కాంబోలో వచ్చిన ‘రోబో’ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ‘2.ఓ’ ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే రోబో మూవీలో విలన్ గా మొదట కమల్ హాసన్ ను అనుకున్నారట. కానీ కమల్ అందుకు నో చెప్పాడు. దానికి గల కారణాన్ని ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అలాగే అప్పట్లో శంకర్ తో (Director Shankar) ఆయన హీరోగా చేయాల్సిన ‘రోబో’ ఎందుకు కార్యరూపం దాల్చలేదనే విషయాన్ని సైతం బయటపెట్టాడు.
పూర్తిగా చదవండి..Kamal Haasan : నేను, శంకర్ ‘రోబో’ చేయాలని అప్పట్లోనే అనుకున్నాం.. కానీ : కమల్ హాసన్
రజినీకాంత్ 'రోబో' మూవీలో విలన్ గా మొదట కమల్ హాసన్ ను అనుకున్నారట. కానీ కమల్ అప్పటి మార్కెట్‌నూ దృష్టిలో పెట్టుకుని ఆ సినిమా చేయకపోవడమే మంచిదని నో చెప్పాడట. ఈ విషయాన్ని ఆయన తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టారు.
Translate this News: