ముంబయి లో ప్రభాస్ కల్కి మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. మరో వారం రోజుల్లో జూన్ 27న మూవీ రిలీజ్ అవనుంది. ప్రభాస్ హీరోగా దీపికా పడుకోన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, కమల్ హసన్ ప్రధాన పాత్రల్లో కల్కి మూవీ రూపొందింది. ఇది రెండు భాగాలుగా రానుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు నాగ్ అశ్విన్‌తో పాటూ నటులు అందరూ మాట్లాడారు. కల్కి లో నేను పార్ట్ అవ్వడం గ్రేట్ హానర్ అన్నారు అమితాబ్ బచ్చన్.కల్కి ఎక్స్పీరియన్స్ ను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు.డైరెక్టర్ నాగ అశ్విన్ కల్కి ని అద్భుతంగా తీశాడని పొగడ్తలతో ముంచేశారు విశ్వనాయకుడు కమల్ హసన్. అమితాబ్ సర్, కమల్ సర్ లాంటి గ్రేట్ లెజెండ్స్ తో వర్క్ చేయడం ఇట్స్ బిగ్గర్ దేన్ డ్రిమ్ అంటూ మురిసిపోయారు ప్రభాస్.కల్కి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని కంప్లిట్ న్యూ వరల్డ్ అని చెప్పారు ఇందులో కీలకపాత్రలో నటించిన దీపికా పడుకోన్.
పూర్తిగా చదవండి..Movies: కల్కి కథేంటో తెలిసిపోయింది..గ్రాండ్‌గా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్
కల్కి 2898 ఏడీ సినిమా మూడు ప్రపంచాల మధ్య సాగుతుందని చెప్పారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇదో సైన్స్ ఫిక్షన్ స్టోరీ అని చెప్పారు. ముంబయ్‌లో కల్కి సినిమా ప్రిరీలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్లో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోన్ పాల్గొన్నారు.
Translate this News: