Mega Family-Allu Arjun : ‘పవన్‌ను టచ్ చేయాలంటే నన్ను దాటుకోని వెళ్లాలి..’ ఇది దశాబ్ద కాలం క్రితం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కోసం అల్లు అర్జున్ చేసిన కామెంట్. బన్నీకి పవన్‌కల్యాణ్ వరసకు మావయ్య అవుతాడు. అయినా బన్నీ మాత్రం ఎఫెక్షన్‌తో ‘మా కల్యాణ్ బాబాయ్.. మా కల్యాణ్ బాబాయ్’ అని ప్రతీ సినిమా ఫంక్షన్లో ఎంతో గొప్పగా చెప్పుకునేవాడు. పవన్‌పై ఎన్నోసార్లు రాజకీయంగా, వ్యక్తిగతంగా మాటల దాడులు జరిగాయి. ఆ సమయంలోనూ అల్లు అర్జున్ అందరికంటే ముందుగా పవన్‌కు సపోర్ట్‌గా నిలిచేవాడు. అయితే ఏళ్లు గడుస్తున్న కొద్దీ బన్నీ మెగా కుటుంబానికి దూరం అవుతూ వచ్చాడు. ఇప్పుడదీ పీక్ స్టేజీకి చేరినట్టే కనిపిస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎంగా పవవ్ కల్యాణ్ ప్రమాణస్వీకారం రోజు సోషల్‌మీడియాలో అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ వార్ మరోసారి రచ్చకెక్కింది. ఇంతకీ మెగా ఫ్యామిలీకి అల్లు కుటుంబానికి మధ్య ఎందుకీ గ్యాప్? అసలు కారణాలేంటి?
పూర్తిగా చదవండి..Allu Arjun : ‘చెప్పను బ్రదర్’.. ఈ డైలాగే మెగా ఫ్యామిలీకి బన్నీని దూరం చేసిందా!?
మా కల్యాణ్ బాబాయ్.. కల్యాణ్ బాబాయ్ అని గొప్పగా చెప్పుకునే అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి ఎందుకు దూరంగా ఉంటున్నాడు. 'సరైనోడు' బ్లాక్ బస్టర్ ఫంక్షన్ లో ఆ పేరు 'చెప్పను బ్రదర్' అని ఎందుకన్నాడు? అసలేం జరిగిందో తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ చదవండి.
Translate this News: