నాగ్ అశ్విన్ డైరెక్షన్లో రాబోతున్న కల్కి 2989 సినిమా కోసం తెలుగు ప్రజలతో పాటూ దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మరో రెండు నెలలో విడుదల అవనున్న ఈ సినిమా ఓ ఫిక్షన్ కథతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ రిలీజే ఒక రేంజ్లో ఉంది. కల్కి సినిమా కోసం నాగ్ అశ్విన్ కొత్త వాతావరణం సృష్టించాడు. ఈ మూవీ 800 ఏళ్ళ తర్వాత జరిగే కథగా చూపించబోతున్నారు. దేవుడితో కనెక్షన్ ఉన్న కథ. ఇప్పుడు దీన్ని ఇంగ్లీషు మూవీ డ్యూన్‌తో పోలుస్తున్నారు. డ్యూన్లో 20 వేల సంవత్సరాల తర్వాత భూమిపై సజీవంగా ఉన్న కొంతమంది వారి ఉనికిని కాపాడుకోవడం ఎలాంటి పోరాటం చేసారు అనేది చూపించారు. ఆ సినిమా కోసం కొత్త వాతావరణం సృష్టించారు. ఈ రెండు సినిమా కథాంశం కొంచెం ఒకేలా ఉండడంతో కల్కి మూవీ డ్యూన్‌కు కాపీ అని అందరూ అంటున్నారు.
పూర్తిగా చదవండి..Movies: ఇసుక ఉంటే ఆ సినిమానే అయిపోతుందా..కల్కి సినిమా కాపీపై దర్శకుడు క్లారిటీ
సిల్వర్ స్క్రీన్ విజువల్ వండర్‌గా రాబోతున్న కల్కి 2898 సినిమా గురించి దర్శకుడు నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చారు. ఇది ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ మూవీనే కానీ ఇంగ్లీషు సినిమా డ్యూన్‌తో దీనికి ఎటువంటి సంబంధం లేదని చెప్పారు.
Translate this News: